
మందెక్కువైనప్పుడో, మైండ్ దెంగినప్పుడో - మనసంతా గాడాంధకారం అలముకున్నప్పుడో, నాకో ప్రశ్న ఎదురౌతుంది! - నేనెవర్ని?
ఊడలు దిగిన మర్రిచెట్టు ఆకులు అర్ధరాత్రి చేసే వింత గుసగుసల కకావికలాన్ని?
విస్తారమైన అవహేళనా ప్రహేళికల మూలవస్తువుని?
ఫ్రళయభీకర యముడు చేసే ముష్టియుద్దాల గదాఘాతాన్ని?
విరబోసిన కొరివిదెయ్యపు జగన్మోహినిల తాండవ నృత్య ఘంటికల కాలిపట్టీని?
నిత్యనిగూఢ నిశ్శబ్ద యుద్ధాల్లో పలకని పెదవంచుని?
ఆకాశం తన చీరంచుని సర్దుకునేప్పుడు రాలిపడే ఉల్కాపాతాన్ని?
ఇజాల భేషజాల మధ్య నలిగి చచ్చే పనికిమాలిన ఆత్మల ప్రేతాత్మని?
కనిపించని రెక్కలపై చీకటి రాత్రిలో ఎగురుతున్న మిణుగురుల కాంతిరేఖని?
నైరుతీ ఋతుపవనాల తొలకరిజల్లులో హర్షించి రమించి సువాసనలు గుబాళించే నల్లరేగడి మాగాణిని?
వర్షంలో జలకాలాడిన ఎర్రెర్రని మందారపు పుప్పొడి రేణువులో జాలువారుతున్న ఆఖరి నీటిబొట్టుని?
ఎగసిపడిన అలలదాడిలో దిశానిర్దేశాలు తేల్చుకోలేక కళ్ళు బైర్లు కమ్మి ఊపిరాడని నావికుడిని?
చెప్పని మాటల, చెప్పుడు మాటల ఆంతర్యం తేల్చుకోలేని రుజాగ్రస్త అజ్ఞానిని?
ఆరేసుకోబోయి పారేసుకున్న వగల సెగల యుగళగీతాల వేటూరి పాటని?
రాలిన కన్నీళ్ళ, విరిగి కరిగిన వేనవేల కలల నిస్సారాన్ని?
ఎదగడమే తెలీని మరుగుజ్జు తనంలో నన్ను నాలొకే చుట్టేసుకుంటున్న వల్మీకాన్ని?
నేనెవర్ని????
Note to self : ఛస్ ! దీనెమ్మ జీవితం. ఈసారి మందెక్కువైనా మైండ్ దెంగకుండా చూస్కోవాలి! ఇటువంటి ప్రశ్నలకి ఆస్కారం ఉండదు!!
~Ekalustya
06-MAR-2024
Last edited: