


❣❣❣
నువ్వుంటే నా ప్రక్కన నాకు ఒక ధైర్యం,
నేను పడిన ప్రతి సారి
తట్టి లేపి ముందుకు నడిపిస్తావని...
నేనా!
ఆ పని చేయగలనా?
అని నేనన్న ప్రతి సారి,
హనుమంతుడికి
తన శక్తి ఎవరో చెప్తేనే తెలిసింది అట...
నేను చెప్తున్నాగా
నువ్వు ఆ పని చేయగల
సమర్ధురాలివే అంటూ
నాలోని భయాన్ని
పోగొట్టి ధైర్యాన్ని నూరిపోస్తావు...
నేను తప్పుచేస్తే సరిదిద్దుతావు,
అల్లరి చేస్తే భరిస్తావు,
ముద్దు చేస్తావు,
సంస్కారాన్ని,
విలువల్ని నేర్పిస్తావు...
నీ ఆశీర్వాదాలు ఇస్తావు...
ఇంత చేసి నా నుంచి నువ్వు
ఆశించేది ఏమి ఉండదు...
ఈ స్వచ్ఛమైన ప్రేమకు
నేను సదా
కృతజ్ఞురాలిని...
నాన్నకు ప్రేమతో...

❣❣❣



Last edited: