ఏవమ్మా సీతాకోక చిలుక రోజూ నిన్ను చూస్తుంటే ఆనందంతో పాటు కొంచం అసూయ కూడా వస్తుంది.ఎంచక్కా ఎటు కావాలంటే అటు నీ విహంగాలని స్వేచ్ఛగా విప్పుకుంటూ తిరుగుతావే నీకు నీ వాళ్ళు ఎవరూ అలా నీకు కావాలిసినట్టు ఉంటే చూసినవారు ఏమనుకుంటారు,ఆ నలుగురు ఏమనుకుంటారు అంటూ వెనక రొద ఉండదు అనుకుంట కదా.

అదేంటో మీకంటే ఎంతో మేధాశక్తి ఉన్న మేము మాత్రం మనకి నచ్చిన పని చేయాలన్నా,గట్టిగా నవ్వినా,మాట్లాడినా ఇంటి చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారు,వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అంటూ స్వేచ్ఛకి అడ్డం చెపుతారే తప్ప నువ్వు చేసే పని ఏది అయినా నిజాయితీగా చెయ్యి,నీ వలన ఎవరికి హని కలుగకూడదు అని మంచి మాటలు మాత్రం చెప్పరే.ఎప్పుడు మార్పు వస్తుందో “ఆ నలుగురు ఏమనుకుంటారో” అనే పదం వదిలెయ్యడానికి….